- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది తెలియకపోతే భారతీయురాలిని కానట్టేనా? : కనిమొళి
దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులకు ఏయిర్ పోర్టుల్లో అప్పుడప్పుడు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా డీఎంకే నేత, లోక్‌సభ ఎంపీ కనిమొళి కరుణానిధికి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇండియన్ అవునా? కాదా అని సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి ఒకరు ఆమెను హిందీ భాషలో ప్రశ్నించారు. తమిళంలో కానీ, ఇంగ్లీషులో కానీ మాట్లాడమని కనిమొళి అడిగినపుడు.. ఆ మహిళా అధికారి ఈ క్వశ్చన్ వేశారు. దీనిపై కనిమొళి ఓ ట్వీట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు.
‘ ఈ రోజు ఒక సీఐఎస్ఎఫ్ అధికారి విమానాశ్రయంలో తారసపడ్డారు. తనకు హిందీ తెలియదని చెబుతూనే.. తమిళంలో కానీ, ఇంగ్లీషులో కానీ మాట్లాడమని కోరాను. అందుకు బదులుగా ఆమె మీరు భారతీయురాలా అని ప్రశ్నించింది. ఇక్కడ తాను ఓ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. హిందీ తెలిస్తేనే ఇండియనా? హిందీకి సమానార్థం ఇండియనా?’ అని కనిమొళి ఆ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. ‘హిందీ ఇంపొజిషన్’ అంటూ తన ట్వీట్‌కు హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించి పోస్టు చేశారు. కాగా, ఆమె చేసిన పోస్టుకు పలువురు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.