నిన్న ట్విట్టర్.. నేడు ఫ్యాషన్ డిజైనర్స్.. కంగనకు వరుస షాక్‌లు

by Shyam |
నిన్న ట్విట్టర్.. నేడు ఫ్యాషన్ డిజైనర్స్.. కంగనకు వరుస షాక్‌లు
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ వెస్ట్ బెంగాల్ వయొలెన్స్ గురించి వరుస ట్వీట్స్ చేయడంతో.. తమ మైక్రోబ్లాగింగ్ సైట్ నుంచి కంగన అకౌంట్‌ను సస్పెండ్ చేసింది ట్విట్టర్. తన ట్వీట్స్ ద్వారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించారని, అందుకే అకౌంట్ సస్పెండ్ చేశామని వెల్లడించింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ సైతం కంగనకు షాకిచ్చారు. తనతో ఫ్యూచర్‌లో కలిసి పనిచేసేది లేదని ఆనంద్ భూషణ్, రింజిమ్ దదు స్పష్టం చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని, కంగనతో కొలాబరేట్ అయిన అన్ని ఇమేజెస్‌ను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సరైన పని చేసేందుకు ఎప్పుడూ ఆలస్యం చేయొద్దని.. ఇక తనతో ఎలాంటి అనుబంధం కొనసాగించేది లేదని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా వీరి స్టేట్‌మెంట్‌పై కంగన సిస్టర్ రంగోలి చందేల్ స్పందిస్తూ.. టాప్ యాక్ట్రెస్ కంగన పేరు చెప్పుకుని, ఇలాంటి చిన్న చిన్న ఫ్యాషన్ డిజైనర్స్ పాపులర్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారని ఫైర్ అయింది. ఆనంద్ భూషణ్‌పై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నానని, కంగనతో ఇకపై పనిచేయనని చెప్తున్న తను అసలు ఎప్పుడు పనిచేశాడో చెప్పాలని, దీన్ని కోర్టులో నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పింది.

Advertisement

Next Story