ఫ్రస్టేషన్‌తో టార్చ్‌లైట్‌ విసిరేసిన కమల్

by Shamantha N |   ( Updated:2021-03-31 06:06:48.0  )
ఫ్రస్టేషన్‌తో టార్చ్‌లైట్‌ విసిరేసిన కమల్
X

దిశ, చెన్నై: విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్ ఫ్రస్టేషన్‌కు లోనయ్యారు. తమిళనాడు రాజకీయాలలో తనకు తాను టార్చ్‌బేరర్‌గా అభివర్ణించుకున్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో అసహనానికి లోనై తన పార్టీ సింబల్ టార్చ్‌లైట్‌ను విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది.

కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్న కమల్ హాసన్.. బుధవారం అక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మైక్రోఫోన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సిబ్బందికి చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో అసహనానికి గురై చేతిలో ఉన్న టార్చ్‌లైట్‌ను కమల్‌హాసన్ దూరంగా విసిరేశారు.

Next Story

Most Viewed