- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీసం మెలేసిన నందమూరి హీరో.. నెవ్వర్ బిఫోర్ అనేలా..
దిశ, సినిమా : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బింబిసార’. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ ఈరోజే విడుదల చేశారు. ‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది.. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌కు తోడు వండర్‌ఫుల్ విజువల్స్‌తో మూవీపై అంచనాలను పెంచేసింది టీజర్. మునుపెన్నడూ లేనివిధంగా కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా సీరియస్ లుక్‌లో కనిపించారు.
అంతేకాదు టీజర్ చివరన స్టైలిష్ లుక్‌లోనూ కనిపించి ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కనిపిస్తారా? లేదంటే బింబిసారుడే ఈ జనరేషన్‌లోకి వస్తే ఎలా ఉంటుందో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా యన్‌టిఆర్ ఆర్ట్స్ పతాకంపై స్వయంగా కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
BIMBISĀRA Teaser | Nandamuri Kalyan Ram | Vashist | Hari Krishna K | NTR Arts
- Tags
- Bimbisara Teaser