ఆటోలో తరలించినట్లు అంబులెన్స్‌లోనా!

by srinivas |
ఆటోలో తరలించినట్లు అంబులెన్స్‌లోనా!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విస్తరిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రోజురోజూకు 10 వేల కేసులు నమోదు అవుతున్నా.. సీఎం మాత్రం ఆషామాషీగా తీసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఓపెన్ చేయడంతోనే వైరస్ విజృంభిస్తోందన్నారు. షేర్ ఆటోలోగా.. అంబులెన్స్ లో రోగులను తరలించడం సిగ్గుచేటన్నారు.

Advertisement

Next Story