ప్రియాంక పాత్రలో కాజల్?

by Jakkula Samataha |
ప్రియాంక పాత్రలో కాజల్?
X

పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్.. సీనియర్ స్టార్ హీరోలకు బెస్ట్ చాయిస్ అయిపోయింది. తెలుగులో ఆచార్య, ఇండియన్ 2, మోసగాళ్లు సినిమాలు చేస్తున్న భామ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే తను ప్రస్తుతం చేయబోయే వెబ్ సిరీస్ హాలీవుడ్ రీమేక్ అని తెలుస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ ‘క్వాంటికో’లో లీడ్ రోల్‌లో కనిపించగా.. ఈ సిరీస్‌తో తను వరల్డ్‌వైడ్ ఫేమ్‌తో పాటు ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు అదే సిరీస్‌ను ఇండియన్ వెర్షన్ రీమేక్ చేస్తుండగా.. అందులో ప్రియాంక పాత్రను కాజల్ చేయనుంది. నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.

ఇక బాలీవుడ్ ‘క్వీన్’ మూవీకి రీమేక్‌గా ‘పారిస్ పారిస్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ లీడ్ రోల్‌లో కనిపించిన ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’లో తమన్నా లీడ్ రోల్‌ పోషించింది.

Advertisement

Next Story