రణ్‌బీర్ డూప్ ఇకలేరు

by Jakkula Samataha |
రణ్‌బీర్ డూప్ ఇకలేరు
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు జిరాక్స్ కాపీలా ఉన్న జునైద్ షా శుక్రవారం లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉండే అతను జూనియర్ రణ్‌బీర్ కపూర్ అనే పేరు సంపాదించాడు. కాగా, అతనికి గుండెపోటు రావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశాడు. 28ఏళ్ల వయస్సులోనే జునైద్ చనిపోవడంతో సోషల్ మీడియా వేదికగా అతని ఆత్మకు శాంతికి చేకూరాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed