- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘సీఎన్ రావు మృతి తీరని లోటు’’
సీనియర్ ఫోటో జర్నలిస్టు సీఎన్ రావు మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజె) ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎన్ రావు గత 40ఏండ్లుగా ఫొటో జర్నలిస్టుగా మీడియా రంగానికి సేవలు అందించారని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ కేంద్రాలుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పత్రికలకు ఫోటో జర్నలిస్టుగా పనిచేశారని, తాజాగా ఈనాడు దినపత్రికలో పనిచేశారని తెలిపారు. ప్రజలు తమ హక్కులకోసం చేసిన అనేక ఉద్యమాలకు ఆయన అండగా నిలిచారని చెప్పారు. అనేక సంఘటనల్లో అద్భుతమైన ఫోటోలు తీసి ప్రభుత్వాల కళ్ళు తెరిపించారని, ఢిల్లీ కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా సీఎన్ రావు భాగస్వామి అయ్యారన్నారు. ఫోటో జర్నలిజంలో అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారని తెలిపారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటన్నారు. ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.