- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చెత్త సినిమాలే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి..
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన ‘ముంబై సాగా’ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్..మేకర్స్ సినిమా హాళ్లలో మూవీస్ రిలీజ్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 90 శాతం సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను సంప్రదించడం బాధగా ఉందన్నారు. కేవలం తమ సినిమాలు చెత్తగా ఉన్నాయని, థియేటర్స్‌లో కలెక్షన్స్ ఉండవేమోనని భావించిన మేకర్స్ మాత్రమే ఓటీటీలను ఆశ్రయిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
‘ముంబై సాగా’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్, డైరెక్టర్ సంజయ్ గుప్తాతో మాట్లాడానని..‘2019లో సినిమా రిలీజ్ అయితే వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడు రాకపోవచ్చు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని థియేటర్స్ ఓపెన్ కాకపోవచ్చు కానీ ఈ మూవీ ద్వారా కొన్ని అయినా తెరుచుకుంటాయి’ అని చెప్పానన్నారు. ‘ముంబై సాగా’ రిలీజ్ డేట్ ప్రకటించాక మరికొన్ని చిత్రాలు కూడా థియేటర్స్‌లో సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు రావడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.