- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ 20 సిరీస్ నుంచి జోప్రా ఆర్చర్ ఔట్?
దిశ వెబ్‌డెస్క్: టీమిండియాతో టీ 20ల సిరీస్‌కు ముందే ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగలనుంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ భారత్‌తో ఐదు టీ 20ల సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. మోచేతి గాయంతో చివరి టెస్టు మ్యాచ్‌కి ఆర్చర్ దూరమయ్యాడు. కానీ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఇండియాతో జరగనున్న టీ 20 సిరీస్‌కు కూడా జోప్రా ఆర్చర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంగ్లండ్‌కి జోప్రా ఆర్చర్ అత్యంత కీలకమైన ఫాస్ట్ బౌలర్. టీ 20లలో ఫాస్ట్ బౌలర్లు చాలా కీలకం. టీ 20లలో అతడికి మంచి బౌలింగ్ రికార్డు ఉంది. జోప్రా ఆర్చర్ దూరం అయితే ఇంగ్లండ్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కు కష్టాలు తప్పవు.
ప్రస్తుతం జోప్రా ఆర్చర్ గాయాన్ని ఇంగ్లండ్ మెడికల్ స్టాఫ్ పర్యవేక్షిస్తోంది. పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడికి ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లండ్ టీమ్ చెబుతోంది. టెస్టు సిరీస్‌లో పరాజయం పాలైన ఇంగ్లండ్.. టీ 20 సిరీస్‌లో అయినా సత్తా చాటాలని భావిస్తోంది. ఇలాంటి తరుణంలో జోప్రా ఆర్చర్ దూరం అయితే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.