రాత పరీక్ష లేకుండా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

by Harish |
రాత పరీక్ష లేకుండా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ), సౌత్ సెంట్రల్ జోన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

హాస్పిటాలిటీ మానిటర్ - 42

అర్హత: ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 30,000 లతోపాటు ఇతర అలవెన్సులుంటాయి.

వయసు: ఏప్రిల్ 1, 2023 నాటికి 28 ఏళ్లు మించరాదు.

ఎంపిక: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక, తేదీ: 1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఓవర్సీస్, బ్యాంక్ వద్ద వీఎస్ఎస్ నగర్, భువనేశ్వర్ (ఏప్రిల్ 3/ఏప్రిల్ 4, 2023)

2. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎఫ్ -రో, విద్యా నగర్; డీడీ కాలనీ, హైదరాబాద్. (ఏప్రిల్ 8/ఏప్రిల్ 9, 2023)

వెబ్‌సైట్: https://irctc.com

Advertisement

Next Story