భారీ ప్రైజ్‌మనీతో ఈ-గేమింగ్ టోర్నమెంట్ ప్రారంభించిన జియో!

by Shyam |   ( Updated:2021-11-12 09:06:08.0  )
bgmi
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, చిప్ తయారీ సంస్థ మీడియాటెక్ సంయుక్తంగా దేశీయ గేమింగ్ ఔత్సాహికుల కోసం ‘గేమింగ్ మాస్టర్ 2.0’ పోటీని ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ పోటీలో పాల్గొనే ప్రొఫెషనల్ గేమర్స్‌తో పాటు ఈ-గేమింగ్ విభాగంలో ఆసక్తి ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) పేరుతో ఈ-స్పోర్ట్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి రూ. 12.50 లక్షల వరకు ప్రైజ్‌మనీ ఇవ్వనున్నాయి.

ఈ గేమింగ్ మాస్టర్ 2.0 కోసం రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచే ప్రారంభమయ్యాయని, జియో గేమ్స్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. ఈ గేమింగ్ టోర్నమెంట్ ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు జరగనుంది. జియో వినియోగదారులు మాత్రమే కాకుండా అందరికీ ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుందని, ఇందులో పాల్గొనేందుకు ఎలాంటి ఫీజు వసూలు చేయట్లేదని కంపెనీ స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్‌పై మరింత సమర్థవంతమైన గేమింగ్ అనుభవం అందించేందుకు మీడియాటెక్ కంపెనీ సరికొత్త చిప్‌సెట్లను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది.

వివాదాల్లో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. హైకోర్టులో పిల్ ధాఖలు

Advertisement

Next Story

Most Viewed