- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబయి ఖాతాలో మరో పరాజయం
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచి లీగ్ ట్రోఫీ సాధించాలనే ముంబయి కలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం రాత్రి తిలక్ మైదానంలో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీతో ముంబయి సిటీ జట్టు 0-2 తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండు ఓటములతో పాయింట్లు లభించక 2వ స్థానానికే పరిమితం అయ్యింది. టాస్ గెలిచిన ముంబయి జట్టు ఎడమ నుంచి కుడికి కిక్ చేయడానికి నిర్ణయించుకున్నది. మొదటి అర్ద భాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా ఒక్క గోల్ కూడా స్కోర్ చేయలేకపోయారు. 72వ నిమిషంలో బోరిస్ సింగ్ గోల్ చేసి జంషెడ్‌పూర్‌కి 1-0 ఆధిక్యం తీసుకొచ్చాడు. 90వ నిమిషంలో మొన్రోయ్ ఇచ్చిన పాస్‌ను డేవిడ్ గ్రాండే గోల్ చేయడంతో జంషెడ్‌పూర్ ఆధిక్యం 2-0కి పెరిగింది. నిర్ణీత సమయం ముగిసే లోపు ముంబయి సిటీ గోల్స్ చేయలేకపోయింది. దీంతో జంషెడ్‌పూర్ 2-0 ఆధిక్యంతో విజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు మొన్రోయ్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఫారుక్ చౌదరికి లభించింది.