- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియాలో మరో 50 ఐసీయూ పడకలను ప్రారంభించిన జయేష్ రంజన్
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 50 పడకలతో నూతనంగా ఐసీయూ వార్డును కాగ్నిజెంట్, రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్ట్ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, సమాచార సాంకేతిక విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఉస్మానియా ఆస్పత్రిలో సుమారు రూ 1.05 కోట్ల ఖర్చుతో నూతనంగా ఐసీయూ వార్డును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ వసతుల లేమితో ఏ రోగి చికిత్సను కోల్పోకూడదన్నారు. కాగ్నిజెంట్, రౌండ్ టేబుల్ ఇండియా సంస్థల చొరవతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ వార్డు అందుబాటులోకి రావడంతో పేదలు కూడా అత్యంత అధునాతన ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోగలుగుతున్నారని అన్నారు . అంతేకాకుండా రోగులకు మార్గదర్శకత్వం, సలహా ఇవ్వడం, ఆరోగ్యకరమైన జీవనం గురించి అవగాహన కల్పించడం కోసం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను కూడా ఆయన ప్రశంసించారు.ఉస్మానియా ఆసుపత్రిలో స్కిన్ బ్యాంక్ వంటి కొత్త చికిత్సలు అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ హీల్ అనే మా పాన్ ఇండియా మెడికల్ రిలీఫ్ చొరవ క్రింద ఐసీయూ పడకలుఅందుబాటులోకి రాగా తమను అందులో భాగస్వామిగా ఎన్నుకున్నందుకు కాగ్నిజెంట్‌కు రౌండ్ టేబుల్ ఇండియా ప్రెసిడెంట్ మోరియా ఫిలిప్, రౌండ్ టేబుల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ సింగ్ లు కృతజ్ఒతలు తెలిపారు.
ప్రపంచం నలుమూలల నుండి రూ .55 కోట్లు సేకరించారని, ఈ నిధులతో దేశవ్యాప్తంగా 60 నుండి 70 ప్రభుత్వ ఆసుపత్రులలో 2500 పడకలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మట్లాడుతూ కాగ్నిజెంట్ , రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్ట్ నిర్వాహకులు ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో రూ 1.05 కోట్ల ఖర్చుతో 50 పడకల ఐసియు వార్డ్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . హాస్పిటల్లో ఇప్పటికే 250 ఐసీయూ పడకలు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 50 పడకలు సమకూరడంతో వీటి సంఖ్య 300 లకు చేరిందన్నారు . వీటితో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని అన్నారు . ఈ కార్యక్రమంలో పలువురు ఆరోఎంఓలు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.