- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాపార లావాదేవీలను సులభతరం చేయడానికే బ్లాక్ చెయిన్
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాపార లావాదేవీలను సులభతరం చేయడానికి బ్లాక్ చెయిన్ దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘బ్లాక్ చెయిన్ సింపోజియం- అన్ బ్లాక్ 4.0, బ్లాక్ చెయిన్ హ్యాకథాన్’ కరపత్రాన్ని ఆదివారం తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రోన్స్ , సైబర్ సెక్యూరిటీ వంటి వివిధ ఎమర్జింగ్ టెక్నాలజీలను పౌరుడికి విలువను అందించడానికి, ఈ-గవర్నెన్స్ ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని 2021-26లో 2వ ఐసీటీ పాలసీలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ప్రభుత్వం డేటా సెక్యూరిటీ, గవర్నెన్స్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందని, సురక్షితమైన వ్యాపారాలు, సురక్షితమైన లావాదేవీలను సులభతరం చేయడానికి బ్లాక్‌చెయిన్ వంటి వేగవంతమైన అభివృద్ధి సాంకేతికతలను అనుసంధానం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఏకీకృతం చేయడం కోసం తెలంగాణ చూస్తోంది. ఈ హ్యాకథాన్ బ్లాక్‌చైన్ నైపుణ్యాలను వేగవంతం చేయడానికి మరియు ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కరించడానికి సరైన వేదిక బ్లాక్ చెయిన్ అన్నారు. డీఎల్టీ ల్యాబ్స్ టీమ్ కో ఫౌండర్ మరియు చీఫ్ ఇన్ఫర్మెషన్ అజయ్ సింగ్, తదితరులున్నారు.