ఊపిరి ఆడటం లేదు డాడీ.. చనిపోతున్నా !

by Shyam |
ఊపిరి ఆడటం లేదు డాడీ.. చనిపోతున్నా !
X

దిశ, వెబ్‌డెస్క్: నాకు ఊపిరి ఆడటం లేదు డాడీ చనిపోతున్నా… వద్దన్నా వినకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు గంటలుగా బతిమిలాడుతున్నా సిబ్బంది వెంటిలేటర్ పెట్టడం లేదు, గుండె ఆగిపోతుంది, చనిపోతున్నా.. ఇక బాయ్ డాడీ అంటూ ఓ వ్యక్తి తన తండ్రికి వీడియో చేసి పంపిన సంఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ జవహార్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న అతడిని వెంటిలేటర్‌పైనే ఉంచుతున్నారు. ఇదే క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఆ వ్యక్తికి వెంటిలేటర్ తొలగించడంతో సిబ్బందిని వేడుకున్నాడు. తనకు ఊపిరి ఆడటం లేదని, వెంటిలేటర్ పెట్టాలని మూడు గంటల పాటు సిబ్బందిని రిక్వెస్ట్ చేశాడు. వారు పట్టించుకోక పోవడంతో ఇక చేసేదేమీ లేక బాధనంతా తండ్రికి వీడియో సందేశంలో చెప్పాడు. గుండె ఆగిపోతుంది, ఇక తనవల్ల కాదు.. బాయ్ డాడీ అంటూ మహమ్మారి కరోనా వైరస్‌తో పోరాడి చనిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed