- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఒలింపిక్స్ నిర్వహించి తీరుతాం’
by Shiva |
X
దిశ, స్పోర్ట్స్ : కరోనా నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలంపిక్స్‌ను 2021లో కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి జపాన్ ప్రధాని యోషిహిడే సుగ తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది జులై – అగస్టు మధ్య నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాది జులైకి వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి, జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి.
‘వచ్చే వేసవి కాలంలో టోక్యో ఒలంపిక్స్, పారా ఒలపింక్స్ క్రీడలను నిర్వహించడానికి సిద్దంగా ఉన్నాము. ఈ క్రీడల నిర్వహణ ద్వారా కరోనాపై విజయం సాధించామనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలనుకుంటున్నాం’ అని శుక్రవారం యూఎన్ జనరల్ అసెంబ్లీకి సుగ ఒక రికార్డెడ్ సందేశాన్ని పంపారు. జపాన్ ప్రధానికి ఈ నెలలోనే బాధ్యతలు చేపట్టిన సుగ.. తొలి సారిగా యూఎన్ జనరల్ అసెంబ్లీకి తన సందేశాన్ని పంపారు.
Advertisement
Next Story