న్యాయవ్యవస్థలో లోపాలు ఎత్తిచూపే ‘జనగణమన’.. టీజర్ రిలీజ్

by Shyam |   ( Updated:2024-06-02 16:28:41.0  )
న్యాయవ్యవస్థలో లోపాలు ఎత్తిచూపే ‘జనగణమన’.. టీజర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్‌ వెంజరమూడు మల్టీస్టారర్ మూవీ ‘జనగణమన’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో వస్తున్న సినిమాను సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. పృథ్వీరాజ్ క్రిమినల్‌గా, సూరజ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్‌ను టీజర్ రూపంలో రిలీజ్ చేసింది. సమాజం పట్ల క్రిమినల్‌కున్న తేలికపాటి భావం, న్యాయవ్యవస్థ పట్ల పోలీస్ ఆఫీసర్‌కున్న నమ్మకం టీజర్‌లో చూపించిన మేకర్స్.. డెప్త్ ఉన్న డైలాగ్స్‌తో సొసైటీని ఆలోచించేలా చేశారు.

క్రిమినల్‌ను ఇంటరాగేషన్ చేస్తున్న ఆఫీసర్ ‘రాజ్యద్రోహం చేసిన నువ్వు ఇక తప్పించుకోలేవని.. తప్పకుండా శిక్ష పడి తీరుతుంది’ అని హెచ్చరించగా.. ‘న్యాయవ్యవస్థలోని లూప్ హోల్స్‌ను ఉపయోగించుకుని కచ్చితంగా బయటపడతాను’ అని సవాల్ చేస్తాడు క్రిమినల్. ‘నిజం ఎప్పటికీ గెలుస్తుంది.. ఇండియన్ జ్యుడిషియరిపై నమ్మకముంది’ అని ఆఫీసర్ తెలపగా.. ‘గాంధీజీ హత్యపై మిక్స్డ్ ఒపీనియన్ ఉన్న ఈ దేశంలో సత్యానికి చోటెక్కడుంది’ అంటూ హేళన చేస్తాడు క్రిమినల్. మొత్తానికి ఇండియాలో జరుగుతున్న పొలిటికల్ గేమ్స్, న్యాయవ్యవస్థ లోపాలపై సినిమా తెరకెక్కుతుండగా.. స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed