- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aus Vs Eng : యాషెస్ సిరీస్ ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్
దిశ, వెబ్‌డెస్క్ : బ్రిస్బేన్ వేదికగా బుధవారం(డిసెంబర్ 8) నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్, సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఫస్ట్ టెస్టుకు దూరం కానున్నాడు. పిక్క కండరాల గాయంతో అతను బ్రిస్బేన్ టెస్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇతడి స్థానంలో మరో పేసర్ క్రిస్ వోక్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు వికెట్ కీపర్ జాస్ బట్లర్ మాట్లాడుతూ.. అండర్సన్ఫిట్గా ఉన్నాడని తెలిపాడు. సుదీర్ఘ సిరీస్ దృష్ట్యా తొలి టెస్టుకు విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందు 2019లో జరిగిన యాషెస్లోనూ ఇదే గాయంతో అండర్సన్ పూర్తి టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.