రేవంత్ రెడ్డికి షాకిచ్చిన జగ్గారెడ్డి

by Shyam |   ( Updated:2021-08-08 11:00:01.0  )
mla jaggareddy
X

దిశ,తెలంగాణ బ్యూరో : తనకు వారం రోజులుగా జ్వరం ఉందని ఇంద్రవెల్లి సభకు హాజరుకాలేనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్కం ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ కార్యదర్శులకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆదివారం లేఖ ద్వారా తెలియజేశారు. సభకు రాకపోవడాన్ని తప్పుగా భావించొద్దని అందుకే ముందుగానే వివరణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పార్టీలో కోవర్టులంటూ చర్చ మొదలైన తర్వాత జగ్గారెడ్డి గైర్హాజరు అవుతున్నందున పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. జ్వరం కారణంగా న్యాయస్థానానికి హాజరు కాలేకపోయానని, దీంతో తనపై వారెంట్ కూడా జారీ చేశారని చెప్పారు. సభ విజయవంతం అయ్యేలా తన నియోజకవర్గ శ్రేణులతో మాట్లాడానని, పెద్ద ఎత్తున ప్రజలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed