‘ఆర్థికంగా బలోపేతం కోసమే నియంత్రిత సాగు’

by Shyam |
‘ఆర్థికంగా బలోపేతం కోసమే నియంత్రిత సాగు’
X

దిశ, నల్లగొండ: డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నియంత్రిత సాగు విధానంపై సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారని జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రతి క్లస్టర్‌లో వ్యవసాయాధికారులు, రైతు బంధు సభ్యులు విస్తృతంగా అవగాహన కలిగించి రైతులకు బాసటగా నిలవాలని మంత్రి కోరారు. అంతకు ముందు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే రజాక్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed