ఐసోలేషన్‌ను ఆహ్లాదంగా మారుస్తున్న అమెజాన్, బుక్‌మైషో

by Shamantha N |
ఐసోలేషన్‌ను ఆహ్లాదంగా మారుస్తున్న అమెజాన్, బుక్‌మైషో
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో 21 రోజుల పాటు ఉండాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. రెండో రోజుకే ఏం చేయాలో అర్థంకాక తలబాదుకుంటున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే వీరందరి కోసం స్ట్రీమింగ్ సర్వీసులు ఆఫర్లు ఇస్తున్నాయి. తమ యాప్‌లో కొన్ని ఎంపిక చేసిన కంటెంట్లను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తూ ఐసోలేషన్ సమయాన్ని ఆహ్లాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి.

పిల్లలతో కలిసి కుటుంబంతో మొత్తం చూడటానికి వీలుగా ఉన్న కొన్ని సినిమాలు, షోలను ఉచితంగా చూడొచ్చని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. వీటిలో పీట్ ద క్యాట్, బాహుబలి ద లాస్ట్ లెజెండ్స్, జస్ట్ యాడ్ మ్యాజిక్, ద స్టింకీ డర్టీ షో, నర్సరీ రైమ్స్, పిల్లల కథలు, చోటా బీమ్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి చూడటానికి ప్రైమ్ వీడియో ఖాతా అవసరం లేదని, కానీ అమెజాన్‌లో ఖాతా ఉంటే చాలని సంస్థ ప్రకటించింది.

అంతేకాకుండా ఎక్కువ మంది తమ స్ట్రీమింగ్ సర్వీసు సేవలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇంటర్నెట్ మీద భారం పెరగకుండా ఉండేందుకు వీడియో ప్రసార క్వాలిటీని స్టాండర్డ్ డెఫినిషన్‌కి తగ్గించింది. దీంతో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లో ఏప్రిల్ 14 వరకు హైడెఫినిషన్ వీడియోలను ఆస్వాదించలేరు.

అమెజాన్ ఆదర్శంగా బుక్‌మైషో యాప్ కూడా లైవ్ ఫ్రమ్ హెచ్‌క్యూ సర్వీసును ఆవిష్కరించింది. బిగ్ బ్యాడ్ వోల్ఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వారి కార్యక్రమాలన్నింటినీ మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు యాప్‌లో ఉచితంగా చూడవచ్చని ప్రకటించింది. ఇందులో మ్యూజీషియన్ల లైవ్ పర్ఫార్మెన్స్, కమెడియన్ల ప్రదర్శన, ఇతర లైవ్ కాన్సర్టులు, ఈవెంట్లు ఉచితంగా చూడొచ్చు. స్టార్ సింగర్ ప్రతీక్ కుహాద్, ఫోక్ సింగర్ ఇండియన్ ఓషిన్, కమెడియన్ వీర్ దాస్‌ల ప్రదర్శనలు ఇందులో చూడొచ్చు.

Tags : BookMyShow, Amazon Prime, Quarantine, Isolation, Free content

Advertisement

Next Story