ఆ ఏనుగు‌కు ఫేర్‌వెల్ పార్టీ

by vinod kumar |
ఆ ఏనుగు‌కు ఫేర్‌వెల్ పార్టీ
X

దిశ, వెబ్‌డెస్క్ : జీవితంలో ఓ తోడు లేకుండా బతకాలంటే చాలా కష్టం. అంతేకాదు ఎక్కడికెళ్లినా ఎవరో ఒకరిని వెంటబెట్టుకుని వెళ్తుంటాం. ఒకరి తోడు లేకుండా ఎక్కడైనా ఉండాల్సి వస్తే చాలా భారంగా భావిస్తాం. అయితే ఒంటరిగా ఉండటానికి మనమే కాదు, జంతువులు కూడా ఇష్టపడవు. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న ఏనుగు(కావన్‌) కోసం యానిమల్ యాక్టివిస్ట్స్, అడ్వొకేట్స్ కోర్టుకెళ్లారు. దానికోసం ఎన్నో ఏళ్లుగా పోరాడారు. ఎట్టకేలకు వారి మొర ఆలకించిన కోర్టు.. ఆ ఏనుగును, మిగతా ఏనుగుల దగ్గరకు పంపించేలా తీర్పునిచ్చింది. కాగా ఆ ఏనుగు ‘జూ’ను వీడి వెళ్తుంటే అక్కడి అధికారులు దానికి ఘనంగా ఫేర్‌వెల్ పార్టీ ఇవ్వడం విశేషం.

శ్రీలంక నుంచి దశాబ్ద కాలం క్రితం కావన్‌ అనే ఏనుగును ఇస్లామామాద్‌లోని ‘మార్గజార్ జూ’కు తీసుకొచ్చారు. దానికి తోడుగా ఉండే ఏనుగు 2012‌లో మరణించడంతో అప్పటి నుంచి అది ఒంటిరిగానే ఉంటోంది. అయితే ఆ ఏనుగును అలా ఒంటరిగా ఉంచడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని, తోటి ఏనుగులుండే ప్రాంతానికి దాన్ని తరలించాలని యానిమల్ యాక్టివిస్ట్స్ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. వారి వాదనలు విన్న తర్వాత.. ఆ ఏనుగుతో పాటు అటువంటి పరిస్థితుల్లో ఉన్న అన్ని జంతువులను తోటి జంతువుల వద్దకు చేర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కవాన్‌ను ఆదివారం (నవంబర్ 29,2020) కంబోడియాలోని వన్యప్రాణుల అభయారణ్యానికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లోని ‘మార్గజార్’ జూలో ఉండే కావన్ అనే ఏనుగుకు ఆ జూ సిబ్బంది, అధికారులు ఘనంగా వీడ్కోలు పార్టీ ఇచ్చారు. బెలూన్లు, రంగురంగుల కాగితాలతో ఏనుగు ఉండే ప్రాంతాన్ని అందంగా అలంకరించారు, ‘వి మిస్ యూ కావన్’ అంటూ ఓ బ్యానర్ కూడా కట్టారు. డీజే బాక్సులు పెట్టుకుని చిందులు వేశారు, భిన్న రకాల వంటలతో విందు ఆరగించారు.

Advertisement

Next Story