- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ కాదు బిగ్గర్‌గా ఉండాలి.. సోదరికి కత్రిన సలహా
దిశ, సినిమా : బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ సిస్టర్ ఇసాబెల్లే కైఫ్ ‘టైమ్ టు డాన్స్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. మార్చి 12న సినిమా రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆమె.. సినీరంగం గురించి సోదరి నుంచి ఎలాంటి టిప్స్ అందుకుందో వివరించింది. డాన్స్‌లో బెస్ట్ అనిపించుకున్న కత్రిన, ఈ సినిమాలోని కొన్ని పాటలను చూసి నైస్ మెసేజ్ సెండ్ చేసిందని తెలిపింది. డాన్సింగ్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో చాలా పెద్దగా ఆలోచిస్తున్నాం అనుకుంటాం గానీ కెమెరాకు సంబంధించినంత వరకు బిగ్ కాదు బిగ్గర్‌గా ఉండాలని సూచించిందని చెప్పింది. సినిమాను కెరియర్‌గా ఎంచుకుంటానని చెప్పినప్పుడు కత్రిన చాలా సపోర్ట్ చేసిందన్న ఇసాబెల్లే.. ‘అనుకున్నది చెయ్, ప్రయత్నించి చూస్తే తప్పేంటి? ఎందుకు సక్సెస్ రాదు’ అని సలహా ఇచ్చిందని తెలిపింది.
కాగా కత్రిన ప్రస్తుతం ‘టైగర్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన కాట్స్.. త్వరలో మరో షెడ్యూల్‌లో జాయిన్ కాబోతోంది. దీంతో పాటు ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది కాంబినేషన్‌లో ‘ఫోన్ బూత్’ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. ఇక ఇసాబెల్లే.. పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి సుస్వాగతం ఖుషామదిద్ సినిమాలో నటించబోతోంది.