- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్ కార్పొరేషన్‌లో విడ్డూరం
దిశ ప్రతినిధి, కరీంనగర్: నిబంధనలను అవకాశంగా మల్చుకుని కరీంనగర్ బల్దియా అధికారులు టెండర్ విధానానికి స్వస్తి పలుకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చివరి క్షణంలో పనులు పూర్తి చేయాలన్న సాకు చూపిస్తూ నామినేషన్ల జాతరకు తెరలేపారు. పట్టణ ప్రగతి, హరితహారం ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా టెండర్ల నిర్వహణ 10 శాతం అయితే 90 శాతం నామినేషన్లతోనే సాగుతోంది.
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రెండుసార్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా బల్దియా పరిధిలోని డివిజన్లలో ఖాళీ స్థలాలు, మురికి కాలువలు క్లీనింగ్ చేయడాన్ని ప్రధాన కార్యక్రమంగా తీసుకున్నారు. ఇందుకోసం అవసరమైన వాహనాలను సమకూర్చుకోవాలని కూడా ముందే ప్రభుత్వం సూచించినా నగరపాలక ఇంజినీరింగ్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని విస్మరించారు. మున్సిపాలిటీలో రూ. ఐదు లక్షల వరకు నామినేషన్ ఇచ్చేందుకు కమిషనర్‌కు అధికారం ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు ముందుగా ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు పిలిచే ప్రక్రియకు మంగళం పాడారు. చివరి క్షణం వరకు వేచి చూసి పట్టణ ప్రగతిలో పనులు చేపట్టకపోతే శ్రీముఖాలు అందుకోవాల్సి వస్తుందన్న కారణంతో చకచకా నామినేషన్ల ద్వారా పనులు అప్పగించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
నామినేషన్ల పద్ధతి..
పట్టణ ప్రగతి పనులు చేపట్టడంలో గతి తప్పామన్న చీవాట్లను అధికారుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందన్న సాకు చూపించి నామినేషన్ల ద్వారా పనులు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని ముందుగానే హెచ్చరించినా కరీంనగర్ కార్పొరేషన్ ఇంజినీర్లు చివరి క్షణం వరకూ ఎందుకు వేచి చూశారో వారికే తెలియాలి. డివిజన్ల వారీగా వివరాలను సేకరించడంలో చూపించిన శ్రద్ధ టెండర్ల ద్వారా పనులు అప్పగించే విషయంలో ఎందుకు చూపించలేదన్న ప్రశ్నకు జవాబు లేకుండా పోయింది. మొదటి పట్టణ ప్రగతి కార్యక్రమంలో 60 డివిజన్లలో సుమారు రూ. 50 లక్షల మేర పనులు నామినేషన్లపై చేయించడం గమనార్హం. రెండో విడత పట్టణ ప్రగతిలో కూడా నామినేషన్ల ప్రక్రియకే ప్రాధాన్యం కల్పించడం విడ్డూరం.
హరితహారంలోనూ..
హరితహారం కార్యక్రమంలో నాటే మొక్కలకు రక్షణ చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం తో పాటు మొక్కల చుట్టూ సిమెంట్ రింగ్ వేయాలని నిర్దేశించింది. ఇందు కోసం రూ. 5 లక్షల చొప్పున మూడు బిట్లు చేసి మొత్తం రూ. 15 లక్షలకు గత నెలలో అధికారులు టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో ముగ్గురు కాంట్రాక్టర్లు వేరు వేరు అంచనాలతో షెడ్యూల్స్ దాఖలు చేశారు. అయితే ఇంజినీరింగ్ అధికారులు టెండర్ ప్రక్రి యను పెండింగ్‌లో పెట్టారు. తాజాగా టెండర్ ప్రక్రియను కాదని నేరుగా సిమెంట్ గాజులు ఏర్పాటు చేస్తున్నారు. అసలు టెండర్ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా మొక్కలకు గాజులు అమర్చే ప్రక్రియ ఎలా చేపట్టారో అర్థం కాకుం డా పోయింది. అంతే కాకుండా టెండ ర్‌లో కోట్ చేసిన ప్రకారం రింగ్ సైజ్ 18 ఇంచుల వెడల్పు, ఎత్తు ఉండాలి కానీ ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నది 12 ఇంచులు దాటి ఉండడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విచారణ జరిపించాలె: భేతి మహేందర్ రెడ్డి, కరీంనగర్ సిటీ బీజేపీ అధ్యక్షుడు
కరీంనగర్ కార్పొరేషన్‌లో నామినేషన్లపై పనులు అప్పగించే విధానంపై విచారణ జరిపించాలి. రూ. 5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించవచ్చన్న సాకు చూపించి టెండర్ ప్రక్రియనే పక్కన పెట్టారు. అధికార పార్టీ నాయకులే ఈ క్లాజ్‌ను తెరపైకి తీసుకువచ్చారన్న అనుమానం వస్తోంది. ముందస్తు ప్రణాళికలు వేసుకున్నప్పుడు చివరి క్షణం వరకూ టెండర్ ప్రక్రియ నిర్వహించకపోవడంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి.