రింకు సింగ్ విద్వంసంలో కొట్టుకుపోయిన విజయ్ శంకర్, రషీద్ ఖాన్

by Mahesh |   ( Updated:2023-04-10 06:14:23.0  )
రింకు సింగ్ విద్వంసంలో కొట్టుకుపోయిన విజయ్ శంకర్, రషీద్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం కలకత్త, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో అనూహ్యం కలకత్తా జట్టు విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్ రింకు సింగ్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి గుజరాత్‌ను ఓడించాడు. కాగా ఇదే మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ కూడా భీకర బ్యాటింగ్ చేశాడు. కేవలం 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ జట్టు 204 పరుగులకు చేరుకుంది. అలాగే రషీద్ ఖాన్ కూడా ఇదే మ్యాచ్‌లో మంచి ఫామ్ లో ఉన్న వెంకటేష్ అయ్యర్, రసూల్, నరైన్ లను అవుట్ చేసి ఈ ఐపీఎల్‌లో మొదటి హ్యాట్రిక్‌ను సాధించాడు. కానీ రింకు సింగ్ చివరి ఓవర్లో వరుసగా 6,6,6,6,6 భారీ సిక్సర్లు కొట్టి గుజరాత్‌ను ఓడించడంతో విజయ్ శంకర్, రషీద్ ఖాన్‌ల కష్టం వృదా అయిపోయింది.

Advertisement

Next Story