ఐపీఎల్- 2023 ట్రోఫీ విన్స్ బై ‘‘బిర్యానీ’’.. స్విగ్గీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Satheesh |   ( Updated:2023-05-30 14:12:29.0  )
ఐపీఎల్- 2023 ట్రోఫీ విన్స్ బై ‘‘బిర్యానీ’’.. స్విగ్గీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ సీజ‌న్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుగా బిర్యానీ నిలిచింది. ఈ విషయాన్ని స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీకి అత్యధికంగా ఆర్డర్లు వ‌చ్చిన‌ట్లు స్విగ్గీ ప్రక‌టించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు రాగా.. ఈ సీజన్‌లో 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని వెల్లడించింది. ఈ సందర్భంగా బిర్యానీ ట్రోఫిని గెలుచుకుందంటూ ఫన్నీ ట్వీట్ చేసింది.

మరోవైపు ఐపీఎల్ సీజన్‌ను స్విగ్గీ బాగానే క్యాష్ చేసుకుంది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్‌లో నెటిజన్లను ఆకర్షించింది. ముంబైతో ఎలిమినేటర్ పోరులో లక్నో ఓడిపోవడంతో..‘అబ్బాయిలూ టెన్షన్ పడకండి.. మేము లక్నోలో టిష్యూలను రీస్టాక్ చేయడం ప్రారంభించాం’ అంటూ ట్రోల్ చేసింది. ఇక నిన్న ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల పదేపదే ఆగిపోతుండటంపై ‘అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారు?’ అంటూ ఫన్నీ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story