కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్.. పూర్తి జట్టు ఇదే..!

by Satheesh |   ( Updated:2024-05-19 10:07:22.0  )
కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్.. పూర్తి జట్టు ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఇవాళ జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో పంజాజ్ కింగ్స్ టాస్ గెలిచింది. పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ సామ్ కరన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో జితేశ్ శర్మ జట్టు పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన జితేశ్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో హామ్ గ్రౌండ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. ఇక, ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ పంజాబ్‌కు నామామాత్రం కాగా.. ఎస్ఆర్‌హెచ్‌కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రెండవ ప్లేస్‌కు దూసుకెళ్తుంది. తద్వారా క్యాలిఫయర్‌ 1 కేకేఆర్‌తో తలపడి ఓడిన ఎలిమినేటర్ 2 ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. దీంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెకండ్ పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌కు వెళ్లాలని కోరుకుంటున్నారు.

జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే, రిలీ రోసౌవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(w/c), అశుతోష్ శర్మ, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్

Advertisement

Next Story

Most Viewed