- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maxwell: కేఏ రాహుల్‌కు క్షమాపణ చెప్పిన ఆస్ట్రేలియన్ స్టార్ మ్యాక్స్‌వెల్
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్‌రౌండర్(Australian all-rounder) గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా గత వన్డే వరల్డ్ కప్‌లో ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో విరోచితంగా పోరాడి ఒంటిచేత్తో మ్యాక్స్‌వెల్ మ్యాచ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్ మాక్స్‌వెల్(Maxwell)ను హీరోను చేసింది. అయితే, ఆ దేశ జట్టు తరపున అద్భుతంగా రాణించినా.. ఐపీఎల్‌కు వచ్చేసరికి మ్యాక్స్‌వెల్(Maxwell) తడబడుతున్నాడు.
ముఖ్యంగా 2020 సీజన్ ఐపీఎల్(IPL)లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. తాజాగా ఆ సీజన్‌పై తన ‘ది షో మ్యాన్’ పుస్తకంలో మ్యాక్స్‌వెల్ పేర్కొన్నారు. ‘2020 సీజన్‌లో నేను ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడలేదు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. దీంతో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు క్షమాపణ చెప్పాను. అలాగే 2017 సీజన్‌లోనూ కెప్టెన్‌గా ఉండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను’ అని మ్యాక్స్‌వెల్(Maxwell) ఆ పుస్తకంలో పేర్కొన్నారు.