స్టొయినీస్ వీరబాదుడు.. 25 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ

by Javid Pasha |   ( Updated:2023-04-10 17:13:44.0  )
స్టొయినీస్ వీరబాదుడు.. 25 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ స్టొయినీస్ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. 25 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 30 బంతుల్లో 65 రన్స్ చేసిన స్టొయినీస్.. కర్ణ్ శర్మ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక తన 65 రన్స్ లో 54 పరుగులు బౌండరీల ( 5 సిక్సర్లు, 6 ఫోర్లు) రూపంలో వచ్చినవే. కాగా టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ తరఫున కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీలు చేశారు.

Advertisement

Next Story