- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం మంచి జోరు మీదున్న లక్నో.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కొంచెం తడబడిన పంజాబ్ ఐదో స్థానానికి పడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కైల్ మేయర్స్ వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమైన విషయం తెలిసిందే. గాయం కారణంగానే శిఖర్ ధావన్ ఆడటం లేదని పంజాబ్ కింగ్స్ తాత్కలిక కెప్టెన్ సామ్ కరణ్ తెలిపాడు. దాంతో సామ్ కరణ్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో శిఖర్ ధావన్ గాయపడ్డాడని, అతని గాయం తీవ్రతపై స్పష్టత లేదన్నాడు.
అయితే వీలైనంత త్వరగా ధావన్ బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నామని చెప్పాడు. శిఖర్ ధావన్ లేకపోవడం తమ జట్టుకు గట్టి ఎదురుదెబ్బని సామ్ కరణ్ అభిప్రాయపడ్డాడు. శిఖర్ ధావన్ దూరమవడంతో జట్టులోకి ఇద్దరూ ఇండియన్ బ్యాటర్లు వచ్చారని, సికిందర్ రాజా కూడా తుది జట్టులోకి వచ్చాడని తెలిపాడు. ఈ వికెట్‌పై తొలి మ్యాచ్ అని చెప్పిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఏదైనా జరుగొచ్చన్నాడు. విభిన్నమైన కండిషన్స్‌లో తమ సామర్థ్యానికి అసలు సిసలు సవాల్‌గా ఈ మ్యాచ్ నిలుస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతీ ఆటగాడు టోర్నీని ఆస్వాదిస్తున్నారని, అభిమానుల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని చెప్పాడు.
లక్నో సూపర్ జెయింట్స్:
కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(కెప్టెన్), ఆయూష్ బదోని, యుధ్‌విర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
పంజాబ్ కింగ్స్:
అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికిందర్ రాజా, జితేశ్ శర్మ(కీపర్), షారుఖ్ ఖాన్, సామ్ కరణ్(కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్