- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లూ చెరో మూడు మ్యాచులాడి 4 పాయింట్లతో ఉన్నాయి. మరి నేటి పోరులో గెలుపు ఎవరిది..?
సంజూ సేనదే జోష్..
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ దూకుడు మీద కనిపిస్తోంది. చాలా బ్యాలెన్సింగ్‌గా ఆడుతోంది. జట్టును కెప్టెన్ సంజూ శాంసన్ ముందుండి నడిపిస్తున్నాడు. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్ వీరోచిత ఫామ్‌లో ఉన్నారు. సంజూ బ్యాటింగ్ గురించి తెలిసిందే. మిడిలార్డర్‌లో దేవదత్ పడిక్కల్, హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జోరెల్, రవిచంద్రన్ అశ్విన్ నిలబడుతున్నారు. రాజస్థాన్ బౌలింగ్ అద్భుతంగా బంతిని స్వింగ్ చేస్తూ.. ట్రెంట్ బౌల్ట్, మిస్టరీ స్పిన్‌తో యూజీ చాహల్ అపోజిషన్‌ను కకా వికలం చేస్తున్నారు. కేఎం ఆసిఫ్, జేసన్ హోల్డర్, అశ్విన్ కన్‌సిస్టెంట్‌గా బౌలింగ్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్లోనై బలమైన బ్యాకప్ ప్లేయర్లు ఉన్నారు.
మరోవైపు చెన్నై ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మాత్రం బ్లాస్టింగ్ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. మిడిలార్డర్లో రాయుడు, మొయిన్, ధోనీని నమ్ముకోలేని సిచ్యువేషన్. శివమ్ మావి పర్లేదు. జడ్డూ బంతి, బ్యాటుతో రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. బౌలింగ్, జట్టు కూర్పు పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీపక్ చాహర్ గాయపడ్డాడు. స్టోక్స్ బంతి పట్టుకోవడం లేదు. మొయిన్‌దీ ఇదే పరిస్థితి. మిచెల్ శాంట్నర్ ఒక్కడే అదరగొడుతున్నాడు. ట్రోఫీ గెలిచి ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని ధోనీ పట్టుదలగా ఉన్నాడు.
చెపాక్ పిచ్ స్పిన్నర్లకే అనుకూలం..!
సహజంగా చెపాక్ మందకొడిగా ఉంటుంది. ఈ సీజన్లో మాత్రం హై స్కోరింగ్ రేట్ కనిపిస్తోంది. పగలు ఉక్కపోత, రాత్రి చల్లగా ఉంటుంది. వికెట్ మందకొడిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ టర్న్ అవుతుంది. వర్షం రావడానికి 10 శాతం ఛాన్సుంది. ఒకవైపు బౌండరీ సైజు పెద్దగా ఉంటుంది. కాబట్టి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (C/WK), సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ (డ్వైన్ ప్రిటోరియస్ తరఫున), ఆకాష్ణ సింగ్.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (C/WK), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
Here are the @ChennaiIPL & @rajasthanroyals line-ups for this mouthwatering clash 👌 🔽
— IndianPremierLeague (@IPL) April 12, 2023
Follow the match ▶️ https://t.co/IgV0ZtiJJA#TATAIPL | #CSKvRR pic.twitter.com/YkQFmiSsRa