IPL 2023: కేకేఆర్‌కు బిగ్ షాక్.. ప్లేయర్స్ అందరికి భారీగా జరిమానా

by Vinod kumar |   ( Updated:2023-05-15 12:19:22.0  )
IPL 2023: కేకేఆర్‌కు బిగ్ షాక్.. ప్లేయర్స్ అందరికి భారీగా జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే స్లో ఓవర్‌నెట్ కారణంగా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఈ సీజన్‌లో రెండోసారి స్లో ఓవర్‌నెట్‌కు కారణం కావడంతో రూల్స్ ప్రకారం భారీగా జరిమానా విధించారు. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు రూ. 24 లక్షల జరిమానా విధించగా.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టులోని మిగతా ఆటగాళ్లందరికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే దాన్ని పెనాల్టీగా విధించారు. నిర్ణీత సమయం కన్నా కేకేఆర్ ఒక ఓవర్ తక్కువ వేసింది. ఇక ఈ ఓవర్‌ను రూల్స్ ప్రకారం కేకేఆర్ సర్కిల్ బయట నలుగు ఫీల్డర్లతోనే పూర్తి చేయించింది. ఈ సమయంలో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా అంపైర్లతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. మ్యాచ్ అనంతరం నితీశ్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో వదిలేశారు.

నిబంధనల ప్రకారం.. రెండో సారి రిపీట్ అయితే కెప్టెన్‌కు 24 లక్షలతో పాటు జట్టులోని ఆటగాళ్లందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే దాన్ని జరిమానాగా వసూలు చేస్తారు. మూడోసారి రిపీట్ అయితే మాత్రం ఆ జట్టు కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా విధించడంతోపాటు.. ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు. జట్టులోని మిగతా ఆటగాళ్లకు రూ.12 లక్షల చొప్పున లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.

Advertisement

Next Story