Rohit Sharma : వివాదాస్పద అవుట్.. ఇంతకీ అది అవుటా.. నాటౌటా..?

by Mahesh |   ( Updated:2023-05-01 05:44:59.0  )
Rohit Sharma : వివాదాస్పద అవుట్.. ఇంతకీ అది అవుటా.. నాటౌటా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 1000వ మ్యాచ్, అలాగే రోహిత్ శర్మ బర్త్‌డే కావడంతో ఈ మ్యాచ్‌పై ప్రేక్షులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బ్యాటింగ్ పై కూడా అభిమానులకు భారీ ఆశలు ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ RR పేసర్ సందీప్ శర్మ చేతిలో 3 పరుగులకు అవుట్ అయ్యాడు. అయితే రోహిత్ అవుట్ పై క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రోహిత్ అవుట్ కు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే రోహిత్ అవుట్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియోలో సంజు శాంసన్ బాల్ కంటే ముందే వికెట్లను తాకాడు. ఇది ఆ వీడియోలో క్లీయర్‌గా కనిపించింది. అయినప్పటికి రోహిత్ ను అవుట్ గా ఎలా ప్రకటిస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story