టీ20 వరల్డ్ కప్ ముందే ఐపీఎల్ నిర్వహిం చాలి : మైఖేల్ వాన్

by vinod kumar |
టీ20 వరల్డ్ కప్ ముందే ఐపీఎల్ నిర్వహిం చాలి : మైఖేల్ వాన్
X

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండటంతో అన్ని రకాల క్రీడా ఈవెంట్లు రద్దయ్యాయి. బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్‌ను అధికారికంగా రద్దు చేయకపోయినా.. ఏప్రిల్ 15 తర్వాతైనా జరిగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ కీలకమైన సూచన చేశారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఒక ఐదు వారాల పాటు ఐపీఎల్ నిర్వహించాలన్నాడు. ఐపీఎల్ నిర్వహించడం వల్ల ఆటగాళ్లందరికీ అది వరల్డ్ కప్‌కు సన్నాహకంగానూ ఉపయోగపడగలదని ట్వీట్ చేశాడు. కాగా, వాన్ సూచన మేరకైతే ఐపీఎల్‌ను సెప్టెంబర్‌లో నిర్వహించాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆసియా కప్ జరగనుంది. ఆ తర్వాత భారత్‌లో ఇంగ్లాండ్ జట్టు పర్యటన కూడా ఉంది. వీటి షెడ్యూల్ మార్చడం కాస్త కష్టమే. ఒక వేళ మార్చినా.. అది ఇండియాలో వర్షాకాలం. ఇక్కడ భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై, ముంబై వంటి నగరాలకు వరద ముప్పు కూడా ఉండే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహణ కష్టంగా మారొచ్చు. ఇదే విషయాన్ని బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ అధికారి కూడా వెల్లడించడం విశేషం.

మరోవైపు విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఆసక్తి చూపించడం లేదు. మరి ఈ ఏడాది ఐపీఎల్ భవితవ్యం ఏమిటో ఏప్రిల్ 15 తర్వాతే తేలనుంది.

Tags: T20 World cup, IPL, Michael vaughn, BCCI

Advertisement

Next Story

Most Viewed