- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా జరుగుతోంది. మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా జోరుగా బెట్టింగ్‌లు వేస్తున్నారు. వేల నుంచి లక్షల వరకు బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇలా బెట్టింగ్‌లు వేసి డబ్బులు పొగోట్టుకుంటున్నవారు ఎందరో ఉన్నారు.
తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా.. తెలంగాణ బెట్టింగ్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్న బంటు రాజేష్‌ను అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి రూ.30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బెట్ వే, బెట్ 365, 1xbet లాంటి అనేక యాప్‌ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఐపీఎల్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.
Next Story