ఇంటర్మీడియట్ ఫీజు వివరాలు ఇవే

by Anukaran |
ఇంటర్మీడియట్ ఫీజు వివరాలు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో : పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ రెండు సంవత్సరాల విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 11 వరకు అధికారులు అవకాశం ఇచ్చారు. రూ.100 రుసుంతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, రూ.500 రుసుంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి రెండో తేదీ వరకు చెల్లించవచ్చు. వెయ్యి రూపాయల ఆలస్య రుసుంతో మార్చి తొమ్మిదో తేదీ వరకు, రెండువేల రూపాయల అపరాధ రుసుంతో మార్చి 16 వరకూ విద్యార్థులు ఫీజులు చెల్లించవచ్చు.

గడువు ముగిసిన మరుసటి రోజులోపు ఫీజులు ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలో చేరేవిధంగా ఆన్‌లైన్‌లోనే ఫీజుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్స్‌ను బోర్డు ఆదేశించింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్ రెగ్యులర్ (ఆర్ట్స్, సైన్స్) విద్యార్థులకు రూ.480, బైపీసీ విద్యార్థులకు రూ.620 గా నిర్ణయించారు. ఫస్టియర్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫెయిలైన సబ్జెక్టులకు రూ.480 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషన్ కోర్సులకు ప్రాక్టికల్స్‌తో కలిపి రూ.670 ఫీజు నిర్ణయించాయిరు. ఇంటర్‌ ఫస్టియర్ పరీక్షలు మే ఒకటో తేదీ నుంచి, సెకండియర్ పరీక్షలు మే రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ ఏడు నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది.

పరీక్ష ఫీజుల వివరాలు

ఫస్టియర్:
పరీక్ష ఫీజు: రూ.480
బ్రిడ్జి కోర్సులకు: రూ.620
ఒకేషనల్ ఫీజు: రూ.670
ప్రాక్టికల్, బ్రిడ్జి కోర్సు కలిపి : రూ.810
ఫెయిలయిన విద్యార్థులకు: ఒకటి లేదా అంతకంటే ఎక్కవ సబ్జెక్టులు రూ.480

సెకండియర్ :
పరీక్ష ఫీజు: రూ.480
బ్రిడ్జి కోర్సులకు: రూ.670
ఒకేషనల్ ఫీజు: రూ.670
ప్రాక్టికల్, బ్రిడ్జి కోర్సు కలిపి : రూ.100
ఫెయిలయిన విద్యార్థులకు: ఒకటి లేదా అంతకంటే ఎక్కవ

Advertisement

Next Story

Most Viewed