- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AHA: ‘ఆహా’లో అమలాపాల్.. థ్రిల్లింగ్‌గా ‘కుడి ఎడమైతే’
దిశ, సినిమా : ట్రెండ్‌కు తగ్గట్టుగా కంటెంట్ అందించడంలో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (AHA) నంబర్ వన్‌గా నిలుస్తోంది. వెబ్ సిరీస్‌లు, సెలబ్రిటీ హోస్టింగ్‌తో డిజైన్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ షోస్‌తో అన్ని ఏజ్ గ్రూప్ ఆడియన్స్‌కు కావలసిన ఎంజాయ్‌మెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఆహా’.. బ్లాక్ బస్టర్ సినిమాలతోనూ అలరిస్తోంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే టాలీవుడ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టగా.. అమలాపాల్, రాహుల్ విజయ్ లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’ కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది.
‘లూసియా, యూటర్న్’ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు సంబంధించి తాజాగా రిలీజైన టీజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మీకెప్పుడైనా లైఫ్‌లో జరిగిందే మళ్లీ మళ్లీ జరిగినట్లు అనిపించిందా? అని అమలాపాల్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవగా.. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఇందులో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్‌గా, రాహుల్ విజయ్ డెలివరీ బాయ్‌గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఇండియాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ కానున్న తొలి సైంటిఫిక్ థ్రిల్లర్ సిరీస్ ఇదేనని తెలుస్తోంది. కాగా జూలై 16 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది.