- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగో భేటీ కూడా విఫలం
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ– ఏపీ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా స్పష్టత రాలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బుధవారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలో జరిగిన చర్చలు ఫలించలేదు. గతంలో పేర్కొన్న విషయాలకే రెండువైపులా కట్టుబడి ఉండటంతో చర్చలు ముందుకు సాగలేదు.
లాక్‌డౌన్‌కు ముందు ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరుగుతున్న 1.61 లక్షల కిలోమీటర్లకు సమంగా ఏపీ ఆర్టీసీ బస్సులు కూడా తెలంగాణ ప్రాంతంలో తిప్పేవిధంగా షెడ్యూళ్లను మార్చుకోవాల్సిందేనని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తమ ఎండీతో మాట్లాడి రెండు రోజుల తర్వాత మళ్లీ సమావేశానికి వస్తామని ఏపీ అధికారులు తెలిపారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ కోసం జరిగిన నాలుగో భేటీ కూడా విఫలమైంది.