Instagram Reels :ఇక.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనూ యాడ్స్

by Sujitha Rachapalli |
Instagram Reels :ఇక.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనూ యాడ్స్
X

దిశ, ఫీచర్స్ : తొలిగా కేవలం ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునేందుకు పరిమితమైన ఇన్‌స్టాగ్రామ్, ఆ తర్వాత వీడియో కంటెంట్ రూపొందించే వారికి అనువైన వేదికగా మారింది. ప్రస్తుతం ‘ఇన్‌‌స్టా రీల్స్’ (Instagram Reels)షార్ట్ వీడియోలకు కేరాఫ్‌గా మారింది. ఈ వేదికను సరిగ్గా ఉపయోగించుకుంటే వినోదంతో పాటు, గుర్తింపు, ఉపాధి పొందొచ్చని తెలిసిన విషయమే. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తలుపు తడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇన్‌స్టా రీల్స్‌లోనూ యాడ్స్ ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు ప్రకటనదారులకు ఇది ప్రయోజనకరం కాగా, యూజర్లకు కూడా దీని వల్ల లాభం లేకపోలేదు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో ఇప్పటికే 30 సెకన్ల ప్రకటనలు వస్తున్నాయి. ఇదే మాదిరి రీల్స్‌లోనూ యాడ్స్ రానున్నాయి. వీటిని ఇతరులకు షేర్ చేయొచ్చు. నచ్చితే కామెంట్, లైక్ చేసే వీలుండటంతో పాటు, ఒకవేళ యాడ్ నచ్చితే ఇన్‌స్టా స్టోరీలోనూ పెట్టుకోవచ్చు. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కాగా ఈ యాడ్స్ ద్వారా బిజినెసెస్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా కంపెనీలు ప్రమోట్ చేసుకుంటాయి. ఈ యాడ్స్ ఇన్‌స్టా ఫీడ్‌లోని రీల్స్ ట్యాబ్, రీల్స్ ఇన్ స్టోరీస్, రీల్స్ ఇన్ ఎక్స్‌ప్లోరర్‌లో కనిపిస్తాయి.

ఇన్‌స్టా ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశం, బ్రెజిల్, జర్మనీ, ఆస్ట్రేలియాతో సహా ఎంపిక చేసిన మార్కెట్లలో రీల్స్ ప్రకటనలను పరీక్షించగా, ఆ తర్వాత కెనడా, ఫ్రాన్స్, యు.కె, యు.ఎస్. లోనూ టెస్ట్ చేసింది. ఇందులో భాగంగా బీఎమ్‌డబ్ల్యూ, నెస్లే, లూయిస్ విట్టన్, నెట్‌ఫ్లిక్స్, ఉబెర్ వంటి కంపెనీలు యాడ్స్ అందించాయి. వినియోగదారుడు రీల్స్ ప్రకటనను ఎంత తరచుగా చూస్తారో చెప్పలేము, వీక్షకుడు చూసే ప్రకటనల సంఖ్య వారు ఇన్‌స్టాగ్రామ్‌ను ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని ఇన్‌స్టా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జస్టిన్ ఓసోఫిస్కీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed