పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటిలో విచారణ

by srinivas |
NGT
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసిన రాయలసీమ ఎత్తిపోతల, ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులపై శుక్రవారం విచారణ జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటి ధర్మాసనంలో విచారణ చేపట్టారు. పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్ల విచారించారు. పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్నారని కోస్గి వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లిడ్ అయింది. ప్రాజెక్టు వల్ల తమకు నష్టం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుపై తనిఖీ కమిటీ నివేదిక దాఖలు చేయకపోవడం పట్ల ఎన్జీటి అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిటీ నోడల్ ఏజెన్సీగా తెలంగాణ గనుల శాఖను తొలగించి కేఆర్ఎంబీని ఎన్జీటి నియమించింది. ప్రాజెక్టు నిర్మాణం, పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇవ్వకపోవడం పట్ల ఎన్జీటి అభ్యంతరం వ్యక్తం చేసింది. త్వరగా పర్యావరణ ఉల్లంఘనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కి వాయిదా పడింది.

అటు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గవినోళ్ల శ్రీనివాస్​దాఖలు చేసిన పిటిషన్​విచారణ జరిగింది. ఇటీవల ఈ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేసిన కేఆర్​ఎంబీ నిపుణుల కమిటీ ఎన్జీటీలో నివేదికను సమర్పించింది. అంతకుముందే రాయలసీమ ఎత్తిపోతల పనులు జరుగడంపై పర్యావరణ ముప్పుపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పర్యావరణ నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని ఎన్జీటీకి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ విన్నవించింది. దీంతో సెప్టెంబర్​ 8కి కేసును వాయిదా వేసింది. సెప్టెంబర్​ 8న అన్ని అంశాలను పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed