- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ స్థలం వైద్యశాఖకు కేటాయింపు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలు ఉన్న స్థలంలో ఎంజీఎం ఆసుపత్రిని తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో జిల్లా సెంట్రల్ జైలు నుంచి ఈరోజు 960 మంది ఖైదీలను రాష్ట్రంలోని ఇతర జైళ్లకు తరలించనున్నారు. వారిని తరలించేందుకు పోలీసులు ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైదీలు వెళ్లిన తర్వాత జైలును వైద్యశాఖ స్వాధీనం చేసుకోనుంది. ఖైదీల తరలింపు నేపథ్యంలో జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది ఈరోజు సెంట్రల్ జైలుకు రానున్నారు. అయితే వరంగల్ సెంట్రల్ జైలును మళ్లీ ఎక్కడ నిర్మిస్తారనే విషయంపై ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయకపోవడం గమనార్హం.