జో బైడెన్‌కు గాయాలు

by vinod kumar |
జో బైడెన్‌కు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చిత్తుగా ఓడించిన జో బైడెన్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆదివారం ఉదయం సమయంలో వాషింగ్టన్‌లోని ఆయన నివాసంలో పెంపుడు కుక్కతో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా జారిపడి గాయపడ్డారు. దీంతో బైడెన్ డెలావేర్‌లోని ఆర్థోపెడిక్ డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకున్నారని బైడెన్ కార్యాలయం వెల్లడించింది. అయితే బైడెన్‌కు కుక్కలు అంటే చాలా ఇష్టం అని, త్వరలో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తనతో పాటు తన రెండు పెంపుడు కుక్కలు కూడా వైట్‌హౌస్‌కు రానున్నాయని సమాచారం.

Advertisement

Next Story