షాకింగ్ న్యూస్.. ‘రైతుబంధు’లో పారిశ్రామిక భూములు..!

by Anukaran |
షాకింగ్ న్యూస్.. ‘రైతుబంధు’లో పారిశ్రామిక భూములు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు జాబితాలోకి పారిశ్రామిక భూములు చేరడం రెవెన్యూ అధికారుల పనితీరును తెలియజేస్తుంది. నిధుల మంజూరు ప్రక్రియలో వ్యవసాయాధికారులు వెరిఫికేషన్ చేపట్టడంతో అమలు విషయం బయటపడింది. పాస్ పుస్తాకాలున్నప్పటికీ ఆ భూముల్లో పరిశ్రమలు కొనసాగుతున్నట్టుగా గుర్తించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఈ భూమల వివరాలు వెలుగులోకి వచ్చాయి. వీటితో పాటు వివిధ రకాల కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 2.41లక్షల మందికి రైతుబంధు పథకాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.

పారిశ్రామిక భూములను వ్యవసాయ భూముల జాబితాలో చేర్చి రైతుబంధు పథకాన్ని కొట్టేంసేందుకు కొందరు వ్యాపారులు చేసిన ప్రయత్నాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది, రెవెన్యూ అధికారుల సహకారంతో పాస్ పుస్తకాలను పొంది రైతుబంధు సాయాన్ని పొందాలనుకున్నారు. నిధులను మంజూరు చేసే ప్రక్రియలో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టగా అసలు విషయాలు బయటపడ్డాయి. వ్యవసాయ భూములుగా నమోదు చేసిన భూముల్లో వివిధ రకాల పరిశ్రమలు నెలకొల్పబడ్డాయని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. దీంతో ఆ భూములకు ప్రభుత్వ రైతుబంధు పథకాన్ని నిలిపివేసింది. ఈ తరహా భూములు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అధికంగా ఉన్నట్టుగా అధికారులు తెలిపారు.

2.41లక్షల మందికి రైతుబంధు నిలిపివేత..

ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించిన 63.45లక్షల రైతుల్లో 2.41లక్షల రైతులకు రైతుబంధు సాయాన్ని నిలిపివేశారు. రాష్ట్రంలో కోటి 50 లక్షల ఎకరాల భూములకు రైతుబంధు సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేపట్టగా వీటిలో కోటి 47 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం రూ.7,360.41కోట్లను పంపిణీ చేసింది, 3 లక్షల ఎకరాల భూములకు పంపిణీ చేయాల్సిన రూ.219.59 కోట్లను నిలిపివేశారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములే ఎక్కవగా ఉండగా పాస్ పుస్తకాల్లో వివరాలు తప్పుగా నమోదవడం, బ్యాంక్ ఖాతా నెంబర్లు సరిపోల్చకపోవడం, కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న భూములకు రైతుబంధు సాయం అందలేదు.

Advertisement

Next Story