'3.0' ఉద్దీపన వృద్ధికి అనుకూలమే…!

by Harish |
3.0 ఉద్దీపన వృద్ధికి అనుకూలమే…!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ 3.0 రానున్న త్రైమాసికాల్లో ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందని ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది. అయితే, ఉపాధి, క్రెడిట్, ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించేందుకు వెల్లడించిన ఈ ఉద్దీపన ఆర్థికవ్యవస్థపై ఎంతమేరకు ప్రభావాన్ని కలిగి ఉంటుందనేది నిర్ధారించడం కష్టమని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనలు రాబోయే త్రైమాసికాల్లో దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడాలి, కానీ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం (పీఎల్ఐ) వంటి పథకాల ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రమే కనిపిస్తాయని ఫిచ్ సొల్యూషన్స్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 7.8 శాతం అంచనాను కొనసాగిస్తున్నాము. ప్రస్తుతం ఉన్న 13 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోంది’ అని ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. కాగా, భారత ఉత్పత్తి సామర్థ్యాలను, ఎగుమతులను పెంచేందుకు..ఔషధ, ఆటో, ఆటో పరికరాలతో సహా 10 కీలక రంగాల్లో పీఎల్ఐ పథకాన్ని కేంద్రం గతవారం ఆమోదించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story