డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ సానుకూలం : డీబీఎస్

by Harish |
డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ సానుకూలం : డీబీఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి రెండు త్రైమాసికాల్లో ప్రతికూలంగా ఉందని, అయితే డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండొచ్చని డీబీఎస్ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. ప్రభుత్వ వ్యయం పెరగడమే దీనికి ప్రధాన కారణమని నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

2020 కేలండర్ ఏడాది చివరి త్రైమాసికంలో జీడీపీ ప్రతికూలంగా ఉందని అంచనా వేసిన డీబీఎస్ బ్యాంక్, పూర్తి సంవత్సరం వృద్ధి 6.8 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని తన నివేదిక పేర్కొంది. ‘కరోనా పరిస్థితుల నుంచి బయటపడుతుండటం, ప్రభుత్వం వ్యయం పెంచిన నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి సానుకూలంగా మారిందని’ డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్ ఎకనమిస్ట్ రాధికా రావు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జీడీపీ 24 శాతం, సెప్టెంబర్ త్రైమాసికాల్లో 7.5 శాతం ప్రతికూలంగా వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. 2020-21 రెండో భాగంలో ప్రజా వ్యయం వేగవంతంగా జరిగిందని, ఇది సెప్టెంబర్ త్రైమాసికంలో 12 శాతం ప్రతికూలత నుంచి డిసెంబర్‌లో 29 శాతానికి పెరిగిందని నివేదిక అభిప్రాయపడింది.

Advertisement

Next Story