- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో రికార్డు స్థాయిలో చమురు ధరలు పెరిగిపోవడంతో ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంధన వినియోగం వరుసగా రెండో నెల పడిపోయింది. జనవరిలో ఇంధన వినియోగం 3.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారుగా ఉన్న భారత్‌లో వార్షిక ప్రాతిపదికన ఇంధన వినియోగం 4.9 శాతం క్షీణించి 1.72 కోట్ల టన్నులకు చేరుకుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. నెలవారీ ప్రాతిపదికన ఇంధన డిమాండ్ 4.6 శాతం తగ్గింది.
ఐదు నెలల్లో మొదటిసారి జనవరిలో క్షీణత నమోదు చేసిన తర్వాత భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇది ప్రపంచ మార్కెట్ల ప్రభావంతోనే పెరిగినప్పటికీ చమురు ఉత్పత్తి కోతలను కొనసాగించాలని ప్రపంచ ఉత్పత్తిదారుల నిర్ణయం వల్ల కొన్ని దేశాల రికవరీని దెబ్బతీస్తుందని భారత్ భావిస్తోంది. ఈ పరిణామలతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఇక, భారత్‌లో మొత్తం ఇంధన అమ్మకాల్లో 40 శాతం వాటా ఉన్న డీజిల్ వినియోగం ఫిబ్రవరిలో 3.8 శాతం పడిపోయి 65.5 లక్షల టన్నులకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే 8.5 శాతం క్షీణత. పెట్రోల్ అమ్మకాలు 6.5 శాతం తగ్గి 24.4 లక్షల టన్నులకు పడిపోయాయి. గతేడాది కంటే 3 శాతం తక్కువ.