భారత్‌లో తొలి ‘మోనోలిత్’ ప్రత్యక్షం.!

by Shyam |
భారత్‌లో తొలి ‘మోనోలిత్’ ప్రత్యక్షం.!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఉటా ఎడారితో పాటు రొమేనియాలోని కాలిఫోర్నియా, ఇంగ్లాండ్‌లోని ఐజిల్ ఆఫ్ విట్, యూఎస్ టెక్సాస్ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన పార్కింగ్ ప్లేస్‌లో.. ఇటీవలే మోనోలిత్‌(లోహపు స్తంభం)లు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇలా ఒకచోట అదృశ్యమై, మరో చోట ప్రత్యక్షమవుతున్న మోనోలిత్‌లు పెద్ద మిస్టరీగా మారాయి. అయితే మొత్తం 30 దేశాల్లో ఇలాంటి లోహపు స్తంభాలు ప్రత్యక్ష్యమవడానికి గ్రహాంతరవాసులే కారణమని కొందరు వాదిస్తుండగా.. తాజాగా భారత్‌లోనూ తొలి మోనోలిత్ ప్రత్యక్ష్యమైంది. అదెక్కడంటే..

అహ్మదాబాద్ సిటీ, థల్తేజ్ ప్రాంతంలోని గురుద్వార వద్ద గల సింఫొని ఫారెస్ట్ పార్కులో త్రిభుజాకారంలో 7 ఫీట్ల పొడవున్న మోనోలిత్‌ను నగరవాసులు కనుగొన్నారు. అయితే ఈ మోనోలిత్ ప్రత్యక్షమవడానికి గ్రహాంతరవాసులు కారణం కాదు. ప్రత్యేక ఆకర్షణ కోసం గార్డెన్ నిర్వాహకులే దాన్ని అక్కడ ఏర్పాటు చేశారట. కాగా, ఈ మోనోలిత్‌ను చూసేందుకు తరలివచ్చిన నగరవాసులు.. దాని పక్కనే నిలబడి సెల్ఫీలు దిగారు. ఎస్‌జీ జాతీయ రహదారి సమీపంలోని పార్కులో సందర్శకులను ఆకర్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ మోనోలిత్‌ను డిసెంబర్ 29న గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రారంభించారు. కాగా లోహపు స్తంభంపై ఉన్న మెరిసే ఉపరితలంతో సందర్శకులు తమను తాము చూసుకోవచ్చని, సెల్ఫీ పాయింట్‌గా కూడా ఉపయోగపడుతుందని గార్డెన్ డైరెక్టర్ జిగ్నేష్ పటేల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed