- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్ మనదే..
ప్రపంచంలోనే తొలిసారిగా బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్స్‌ను ఇండియన్ ఆర్మీ వినియోగించనుంది. ఇప్పటికే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను భారత ఆర్మీ వాడుతోంది. దీంతో సైనికులకు రక్షణ పరంగా ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రపంచ ఆర్మీలో ఆయుధాలు,సైనిక, టెక్నాలజీ పరంగా మనకంటే ముందున్న అమెరికా, రష్యా, చైనా కంటే ముందే బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్‌లు ఇండియన్ ఆర్మీకి అందుబాటులోకి రావడంతో రక్షణ వ్యవస్థలో మన దేశం సరికొత్త రికార్డును నెలకొల్పింది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్మీలతో సమానంగా మనదేశం కూడా ఆయుధ, సైనిక, టెక్నాలజీని మెరుగుపరుచుకుంటూ దూసుకుపోతుంది. టాప్ 10 రక్షణ వ్యవస్థ కలిగిన దేశాల్లో ఇండియా ఇప్పటికే 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్‌ల వాడకం ద్వారా ఉగ్రదేశం పాక్ నుంచి మన సైనికుల రక్షణకు ఇది దోహదపడుతుందని రక్షణ రంగ నిపుణులు తెలుపుతున్నారు. కాగా, కాలేజ్ ఆఫ్ మిలిటరీ(సీఎంఈ)లో మేజర్ అనూప్ మిశ్రా వీటిని తయారు చేశారు. ఏకే-47 బుల్లెట్లను కూడా ఈ హెల్మెట్ సమర్థవంతంగా నిలువరిచనుంది. అంతకుముందు స్నైపర్ రైఫిల్ బుల్లెట్లను కూడా తట్టుకునే జాకెట్లను అనూప్ తయారు చేసి భారత ఆర్మీకి అందజేశారు.