- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బార్డర్‌లో యుద్ధ మేఘాలు
దిశ, వెబ్‌డెస్క్: LAC పొడవునా భారత్ సైనికులను భారీగా మొహరిస్తోంది. ఓవైపు అత్యాధునిక ఆయుధాలు కొంటున్న భారత్, అందుబాటులో ఉన్న ఆయుధ సంపత్తిని చైనా సరిహద్దు దిశగా తరలిస్తోంది. ఇక, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా యుద్ధ సన్నద్ధతను చాటుతోంది. సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29 యుద్ధ విమానాల రణగొణ శబ్ధాలతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.
తమ అప్రమత్తత ఎలా ఉందో చూపించేందుకు భారత వాయుసేన కొందరు పాత్రికేయులను సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్ బేస్‌కు తీసుకెళ్లింది. నిరంతరం గాల్లో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాలు పాత్రికేయులకు దర్శనమిచ్చాయి. యుద్ధ విమానాలే కాదు, అమెరికా తయారీ సీ-17, సీ-130జే, రష్యా తయారీ ఐఎల్-76, ఆంటోనోవ్-32 వంటి భారీ విమానాలు కూడా అదనపు దళాలను సరిహద్దుల వద్దకు తరలిస్తూ బిజీగా కనిపించాయి. కేవలం యుద్ధ అవసరాల కోసమే తయారైన అపాచీ హెలికాప్టర్లు కూడా గగనతలంలో సందడి చేశాయి.
మొత్తం మీద తూర్పు లడఖ్ లో ఉన్న ఎయిర్ బేస్ మొత్తం యుద్ధ వాతావరణంతో కోలాహలంగా మారింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు రానుండటంతో భారత రక్షణ రంగంలో కొత్త ఉత్సాహం తొణికిసలాడనున్నది.